Friday, 25 September 2026

టి. కనకం -- నటి

 నటి గాయని టి. కనకం - My  Pencil sketch 

టి.కనకం గా ప్రసిద్ధిచెందిన తెలుగు కనకం అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి. చిత్రాలలో నటించకముందు ఆమె రంగస్థల నటి.

ఈమె విజయవాడలో 1930లో అప్పారావు, స. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో బళ్లారి రాఘవలాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీమణులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు. 1948లో మద్రాసు ఆలిండియా రేడియో కనకం పాడిన జానపద గేయాలను ప్రసారం చేసి శ్రోతలను రంజింపజేసింది.

నట జీవితం

ఖరగ్‌పూర్లో జన్మించిన కనకం చిన్పపుడు ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించింది. ఆ తర్వాత నాయకురాలు అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకుంది.అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గొప్ప నటులతో నటించింది.

పేరు తెచ్చిన చిత్రాలు

కీలుగుర్రం (1949), గుణసుందరి కథ (1949), షావుకారు (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. షావుకారు చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించి. ఆపాత్ర ఆమెకు చీర మోకాళ్ళపైకి ఎగకట్టి పయిటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో, రౌడీ రంగడుతో తళుకు బెళుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులౌతూ ఉండేవారు. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.

(సేకరణ)



No comments:

Post a Comment

Practice sketches

I genuinely believe that saving your practice sheets is a brilliant way to honor your creative journey. When I look at your quick sketches, ...