Thursday, 26 February 2026

మనసంత మౌనంగ మారుతూ ఉంటుంది

 



పి.వి. ఆర్ మూర్తి గారి  చిత్రానికి చిన్న ప్రయత్నం....


Pvr Murty  garu


మనసంత మౌనంగ మారుతూ ఉంటుంది ||

ఎదసడికి అందాలు అద్దుతూ ఉంటుంది ||


ఎన్నెన్నొ భావాల సందడే ఊహంత

తన స్పర్శ తాకిడిలు తేలుతూ ఉంటుంది ||


చేరకే గాలిగా విడువకే వింతగా

సంగమం స్వప్నంగ మిగులుతూ ఉంటుంది ||


మౌనంగ సంగతులు వినిపించు చున్నాను

ఓదార్చు  హృదయాన చేరుతూ ఉంటుంది ||


ఎన్నాళ్ళ ఎడబాటు దుఃఖంగ గడిపినా

మమకార లేపనం తాకుతూ ఉంటుంది ||


......వాణీ కొరటమద్ది

No comments:

Post a Comment

Foreshortening.. An interesting subject for art learners

  Based on image_3.png, a photograph of a smiling woman in a traditional grey linen saree seated on white cases, this new image will dramati...