Saturday, 22 June 2019

నాయిక - కవిత



నా చిత్రానికి  కవయిత్రి  జ్యోతి కంచి కవిత.

నాయిక
~~~~~
పాతపాటకు సొగసులద్ది
కొత్తరాగమే పాడుతున్నా
గాలివాటపు జీవితానికి
దారమేసీ లాగుతున్నా
మౌనపొరలను మడతలేస్తూ
మంత్రజపమే చేస్తుఉన్నా
అనుభవాలతొ లంగరేస్తూ
బతుకుబండే మోస్తువున్నా
పసిడిపూతల పావురాలకు
తెలుపువిలువే నేర్పుతున్నా
పట్టుబట్టీ పంజరాలకు
స్వేచ్ఛగొళ్ళెం తీస్తువున్నా
రాళ్ళదెబ్బలు ఓర్చుటెట్లో
పండ్లచెట్టుకు చెబుతువున్నా
రాలుగాయీ జీవితానికి
నడకసూత్రమే పంచుతున్నా
నన్ను"నేను"గ మలచుకొంటూ
"జ్యోతి"రూపై వెలుగుతున్నా
నిన్నరేపుకు బంధమౌతూ
నేడు"నేనై" మిగులుతున్నా!!..



No comments:

Post a Comment

BBC English - Phrases

Please click the following link and learn    hhttps://www.bbc.co.uk/learningenglish/features/s5english_in_a_minute/251104