Thursday, 22 June 2017

ఎన్ని జ్ఞాపకాలో ....ఎన్నెన్ని జ్ఞాపకాలో .... కవిత




సోదరి Velamuri Luxmi కవిత కి నా బొమ్మ
ఎన్ని జ్ఞాపకాలో ....ఎన్నెన్ని జ్ఞాపకాలో ....
వద్దు అనుకున్నా ముసురుకుని
వస్తాయి నీ జ్ఞాపకాలు ...
ఎన్నెన్ని ...ఎన్నేళ్ళ జ్ఞాపకాలు ...
ఎన్నెన్నో ..' నేను ముందు ' ...' నేను ముందు ' .....
అంటూ వస్తాయి నీ జ్ఞాపకాలు .....
నీపట్ల నాకున్న అపురూప భావం ....
ఎలా నీకు తెలిపేది ......
తలలో తురుముకున్న మల్లెలు
తెస్తున్నాయి ఏవో జ్ఞాపకాలు ....
ఆనాటి , ' నీ ' చూసీ చూడని చూపులు ....
ఆనాటి, ' నా ' భయభీత దొంగచూపులు ...
ఏవీ ......ఆ వెన్నెల మల్లెలు ....
ఏవీ ...ఆ తీయటి తలపులు .....
ఏవీ ...ఆ రాగసరాగాలు ....
నీకు జ్ఞాపకం రావా .....
నీపై నాకున్న అనురాగం .....
చెప్ప లేక పోయింది నా చిన్నిమనసు ....
కళ్ళల్లో ప్రజ్వరిల్లే నా మనో భావం ....
కళ్ళు మోయలేని ఆ అతిరేకం .....
అయినా ప్రేమకు ఒక దారి ఉండనే ఉంది .....
అదే ..ఏకాంత సేవ ....! దివ్య ప్రేమార్చన ..దివ్యనామార్చన ....
నిజమైన దివ్య ప్రేమకు ...
అవతలివారి అంగీకారం కానీ ....
సహాయం కానీ అవసరమే ఉండదు ...
కానీ ..నీ ప్రేమను పొందలేని నేను ....
ఇలాగే వున్నాను.....
నీపై ప్రేమని మరువలేని కళ్ళు .....
చెరొక బాష్పాన్ని రాల్చింది నేస్తమా .....
అవి చెక్కిలి మీదుగా జారి ....
గుండెపై నుంచి జారి ....అయ్యింది
అరచేతిలో అరవిందం ...... - Velamuri Luxmi

1 comment:

Learn English - Vocabulary 2

  Admonish: To warn or reprimand firmly. ​ Advocate: To publicly support or recommend. ​ Affable: Friendly and easy to talk to. ​ Aloof: Dis...