Wednesday, 16 December 2015

మూసివున్న రెప్పలుపై మూగబాసలు


ఈ బొమ్మ కి మిత్రురాలు  శ్రీమతి శశికళ ఓలేటి గారు  facebook లో కవితా రూపంలో స్పందన.

-వాల్చి యున్న రెప్ప వెనుక
వాల్కెనో లెన్నెన్నో.
-
మూసి వున్న కళ్ళల్లో,
మూగ భావా లెన్నెన్నో.
-
బిగి నున్న పెదవు లందు,
బిడియపు నిభిడీ కృతా లెన్నెన్నో. 
-
విర బోసిన కురులలో,
అర విరిసిన విరులెన్నో,
తెర లేసిన కన్నేరు లెన్నో.
ఎన్నో ఎన్నో కలబోసిన ఊహల,భావాల, సోయగాల, శోకాల,విరహాల, విషాదాల, సుఖాల,
సుమాల,వియోగాల, కలయికల, మౌనాల, మంజు వాణి స్వరాల, రాగాల, విరాగ సరాగ సంగీత, సాంత్వనోద్దీపిత దీప కళిక కదా ఆమె.!!!!! ఆమె ఒక ప్రహేళిక.

No comments:

Post a Comment

Drought

Picture of drought created by me with the help of ChatGPT. Here is Q&A session with my student. I hope this would be of help to English ...