నా మిత్రులు వనం వెంకట ప్రసాద రావు గారు నేను వేసిన ఈ బొమ్మకి వ్రాసిన అద్భుతమైన కవిత.భానుమతీ రామకృష్ణ భాసమాన కళాతృష్ణ భేషజమా నైజమా బేహద్బీ యను ప్రశ్న దరహాసపు శశి కళలకు మధుమాసపు రస పసలకు కసి రుస బుస విసురులకు, ముసి నగవుల ముసురులకు, గారపు సింగారపు బంగారపు చెలి కొసరులకు! చిరునవ్వుల మల్లీశ్వరి చురకత్తుల చండీరాణి ఎవరేమన్నా అననీ రాజీలేదను బాణీ! ఓహోహో పావురమే! ఒకపరి వయ్యారమే! పాటకు సరి ఎలకోకిల, ఆట వనమయూరమే! కొందరికది ఠీవి మరికొందరికది దర్పం భయపెట్టే అందం, కుబుసము వీడినదిది సర్పం! ఇందరిలో యిద్దరికే, అందరికా రాచరికం? ఒక మగాడు 'నందమూరి', ఈడ ఆడనందమూరి! (మిత్రులు పొన్నాడ Pvr Murty వారి సౌజన్యముతో..వారి గీతకు నా కూత!)
Copilot's response to my query: You can't eat more than you chew Ah, a twist on the classic! Normally we hear “Don’t bite off mor...
ReplyDeleteనా మిత్రులు వనం వెంకట ప్రసాద రావు గారు నేను వేసిన ఈ బొమ్మకి వ్రాసిన అద్భుతమైన కవిత.
భానుమతీ రామకృష్ణ భాసమాన కళాతృష్ణ
భేషజమా నైజమా బేహద్బీ యను ప్రశ్న
దరహాసపు శశి కళలకు మధుమాసపు రస పసలకు
కసి రుస బుస విసురులకు, ముసి నగవుల ముసురులకు,
గారపు సింగారపు బంగారపు చెలి కొసరులకు!
చిరునవ్వుల మల్లీశ్వరి చురకత్తుల చండీరాణి
ఎవరేమన్నా అననీ రాజీలేదను బాణీ!
ఓహోహో పావురమే! ఒకపరి వయ్యారమే!
పాటకు సరి ఎలకోకిల, ఆట వనమయూరమే!
కొందరికది ఠీవి మరికొందరికది దర్పం
భయపెట్టే అందం, కుబుసము వీడినదిది సర్పం!
ఇందరిలో యిద్దరికే, అందరికా రాచరికం?
ఒక మగాడు 'నందమూరి', ఈడ ఆడనందమూరి!
(మిత్రులు పొన్నాడ Pvr Murty వారి సౌజన్యముతో..వారి గీతకు నా కూత!)