Sunday, 30 April 2017

మహాకవి శ్రీశ్రీ




మదిభావం॥సాహో॥ (కవిత -  శ్రీమతి జ్యోతి కంచి)
~~~~~~~~~~~~
జల్లై
ఉరుమై 
మెరుపై
పిడుగై
ఝరినడకై
కడలిపిలుపులై
జీవితాన్ని మదించే పదమై
జారిపోని ఓ తపంచా వేటై
పదేపదే ఙ్ఞప్తికి వచ్చే పాటై
నీకు నీవే పోటిలేని కోటై
మార్గమై-మార్గబంధువై
కవి లోని రవివై
మహోన్నత రధచక్రాలు పరుగులెత్తించి
అలసి,
మా వెన్నుతట్టి నడిపిస్తున్న
మనీషివయ్యా.....మహాకవి....మహాప్రస్తానివి.....
JK30-4-17
(చిత్రం-Pvr Murty బాబాయ్ ధన్యవాదాలు బాబాయ్ )


Ratna Reddy Yeruva గారి కవిత 

నేను సైతం.....
నేను సైతం కవితాగ్నికి అక్షరాన్నొకటి
ఆహుతిచ్చాను,
నేను సైతం అక్షరసేద్యంలో ఒక రైతునై
కావ్యాల మడి దున్నాను...
నన్ను చూసి నవ్వినా , వెక్కిరించినా
గేలి చేసినా, గోల చేసినా
కవి కులానికి వన్నె తెచ్చేలా
వెన్నెల కుసుమాలని కొన్ని
మనసు కాగితంపై పరిచాను....
వేదనలో అయినా రోదనలో అయినా
ఆవేదనలో అయినా ఆవేశపు ఘడియల్లోనయినా
ఆనందపు అనుభూతుల్లో అయినా
ఆహ్లాదపు క్షణాల్లో అయినా ...
అక్షరాన్నే నమ్ముకున్నాను
కవితనై కమ్ముకున్నాను...
నీకు తెలుసా...
కవి నిశ్శబ్దంలో కూడా అందమైన శబ్దం
వినిపించగలడని,
కారు చీకట్లో కూడా కాంతిరేఖల్ని
కురిపించగలడని...
వెన్నెలై వెలుగులు విరజిమ్ముతాడని
వేకువై నిను నిద్ర లేపుతాడని...
నీకు తెలుసా... నీకు తెలుసా
గుండె పగిలినా కవితే
మనసు నలిగినా కవితే
నవ్వినా కవితే.. ఏడ్చినా కవితే
కలాలనన్నీ మది కాగితాలపై దున్నీ
నేను సైతం కవితాగ్నికి అక్షరాన్నొక్కటి
ఆహుతిచ్చాను...
నాకు నేనే అక్షర యజ్ణంలో
సంతోషంగా సమిధనయ్యాను...

Drought

Picture of drought created by me with the help of ChatGPT. Here is Q&A session with my student. I hope this would be of help to English ...