Friday, 14 July 2017

Lovers - Pencil sketch

నా పెన్సిల్ చిత్రం - కవిత courtesy Sudha Rani - My best wishes to her.
🌸సుధా భావ మధుర తరంగాలు🌸
🌹నీ కోసం🌹
గుప్పెడంత గుండెను తడిమావు నువ్వనీ...
కనుల తడి వచ్చిందే నీకోసం
మౌనవీణ మధురంగా మీటావు నువ్వనీ....
హృదయ గీతం పాడుతున్నదీ నీకోసం
కనురెప్పల కౌగిలి అయ్యావు నువ్వనీ...
కనుపాపగా మార్చుకున్నదీ నీకోసం
ఆశల పల్లకి ఎక్కించావు నువ్వనీ....
దరహాసపూలు విరబూసాయి నీకోసం
వెన్నెలంత గుమ్మరించి అభిషేకించావు నువ్వనీ....
నా మనసు అర్పణ చేసాను నీకోసం
నేనున్నది నీకోసం....నువ్వున్నది నాకోసమని
నీ ఊసులకు నా చూపులనే ముడివేసా
విడిపోని బంధంగా....ప్రణయ రాగ మధురిమగా
అందమైన నా అంతరంగమా.....
పాడవే ఇక ఎప్పటికీ
'అతని' భావ గీతాన్నీ.......
🍂సుధా మైత్రేయి🍂

No comments:

Post a Comment

Value of time

Picture created with the help of ChatGPT. Here are some simple questions and answers on the value of time, suitable for students, readers, o...